Tuesday, May 22, 2012

నీ సమక్షం

'నేను' అనే అహంకారాన్ని నీ మనసులో క్షరం చేసావు.
నీ క్రీగంటి చూపులతో నా మనసులో చెరగని అక్షరాన్ని రాసావు.

నా చెలి చిరునగవులకై చకోరమై ప్రతీక్షించగలేనా  ..
అది దరిశించిన  మరుక్షణం కాలానికి ఎదురెళ్లి ఆమెను ఆపేక్షించగ  రానా ..

కలను వదలి ఇలకు నడిచిన నిన్ను ప్రతీక్షణం కలవరింతల నడుమ కలవర పరచనా
వరదలై పొంగు నీ వలపు వెన్నెలలో నా వయసు సేదదీరగా నీకై అనుక్షణం పరితపించనా

వేల వసంతాలను ఒక్కసారిగా నా కనుల ముందుంచినట్టైంది  నీ సమక్షం లో
కలల అలజడుల  ఉద్రుతిలో నేనేమైపోతానో తెలియదు నీ పరోక్షం లో

తీక్షణమైన నీ కంటిచుపుకి తాళలేని నా కనులు ఇలను సైతం కనుగోనలేకపోయాయి...
నీకై నిరీక్షణ ఇంతటి సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని కలను సైతం ఊహిమ్పలేకాపోయాను ..

కలగర్భం లో కలిసిపోకుండా కలకాలం ఉండాలి నీ మీద నాకున్న ప్రేమ ....ఇది నా మనోక్షరం...
నీ కై జాలువారిన ఈ చేవ్రాలు నీ కై అంకితమివ్వ ....నీకిదే నా సుమాక్షరం...

Saturday, May 19, 2012

ప్రేమా ఇది వరమా శాపమా...

నీకై నీరీక్షణ  సుదూర పయనమని తెలిసినా 
ప్రతీక్షణం నీ కోసం ఎదురుచూస్తూనే ఉంటాను.
నీకు నాకు మధ్య ఉన్న సంబంధం కంటికి కలకు ఉన్న సంబంధం లాంటిదేమో,,,
ఎందుకంటె కళ్ళుమూసుకుంటేనే  కలలోస్తాయి 
కాని కలలు ఇలకి వచ్చేసరికి కనుమరుగుతాయి 
నేను కనులైతే నీవు నా కలవైనావు..
ప్చ్ ...కనులు ముస్తేనే కనపడతావ....
కనులయదుట  నిలబదలేవ...
నీకోసం వేల రాత్రులు ఎదురు చుసిన నా కనులకు విముక్తి లేదా..
ప్రతి పగలు నీకోసం పగిలేల ఏడ్చే నా గుండె సవ్వడి వినపడలేదా...
ప్రతి సాయంత్రం నా మనసూ చెప్పే మౌన భావం నీకు అవగతమవలేదా...
రోజులేన్ని గడిచిన రుతువులేన్ని మారిన నీమీద నాకున్న ప్రేమ మారదు...
నా మనసు నీ ఆత్మ సన్నిధిని విడలేదు అని ...
కలనైన ఇలనైన నీ కనుల సైగను సైతం మరువలేని నేను...
నిన్నెల మరచిపోగలను....
ఏదో పిచ్చి ఆవేశం నన్ను నిన్ను మర్చిపోమ్మంటుంది...
పాపం తెలియదు దానికి దానికున్న స్థానం తాత్కాలికమని..
మరుక్షణం నేను నీ వశమని  ...
ఇలా ఎన్ని భావావేశాలకు బదులుచేప్పమంటావు...చెప్పు...
కనబడకుండా కవ్వించే నీ కొంటె చూపు కోసం 
కొన్ని రోజులేంటి..కొన్ని యుగాలైనా వెచిఉంటాను ప్రియా...
నా కనుల కొలనులో కాలువలు బూయించ శసివై  ఈ నిశిని వీడి రావా...
నా మనసు వాకిట రంగుల హరివిల్లై సాత్షాత్కరించాలేవా 
ప్రేమా ఇది వరమా శాపమా...
 



Sunday, November 1, 2009

ఆ క్షణం.....

ఆ క్షణం,
నిన్ను నాకు ముడివేసిన ఆ క్షణం,
అనంత విశ్వాన్ని నీ కంటి వెలుగులో చూసిన ఆ క్షణం ,
నా కలలు, తీరాన్ని చేరాయని,
మురిసి మెరిసిన నా కంటిపాప,
ఓ మౌనరాగంలా తలవంచగా.....
తీరాన్ని తాకిన ఆ అలలు,
ఓ క్షణం నా కనుల ముంగిట్లో ఓ స్వాతిముత్యంలా మెరిసి,
అలా ఓ అమృతధారై నా చెక్కిళ్ళను తాకగా,
తెలియని తపనేదో పెల్లుబికి,
పడమటిసంధ్యారాగం పాడుతూ
ఊహల జగతిలో ఊయలలూగుతున్న
నా ఊసుల ఉషోదయానికి స్వాగతం పలుకుతూంటే,
రేపటి వెలుగుల వర్షం, ఈనాటి ప్రియ హర్షమై,
యెద మాటున దాగిన వెన్నెలని అల్లుతూ
ప్రియరాగాలు పలికిందిలా .............

ఆ మబ్బుల మేళాలూ, మెరుపుల తాళాలూ,
చినుకుల మంత్రాలూ........మనకోసమేగా,

ఈ పూవుల నవ్వులూ, సెలయేటి కబుర్లూ,
రాయంచల కులుకులూ.....మనతోనేగా,

ఆ పిల్లగాలుల సవ్వడులూ, జాజి పందిరి సుగంధాలు,
చంద్రకాంతశిలల విరుపులూ.....మనకోసమేగా,

ఈ చిలకల అలకలూ, పచ్చిక తళుకులూ,
ఆకాశపు పిలుపులూ.......మనతోనేగా,

ఆ చుక్కల చూపులూ,వెన్నెలా వలపులూ,
చలిగాలి కౌగిళ్ళూ.......మనకోసమేగా,

ప్రతీ రోజూ మధుమాసమైతే......,
ప్రతి రాత్రీ శరత్ రాత్రైతే......,
ప్రతి క్షణం వసంతమేగా ప్రియా...........

Wednesday, August 19, 2009

నీవే సుమా!



జన్మించిన ప్రతి వ్యక్తీ జీవితం
సార్ధకం అవ్వాలని లేదు.
కాని సాధించాలన్న తపన వుంటే .......
మరణాన్ని సైతం లెక్కచేయరు కార్యసాధకులు.
అటువంటి కార్యసాధకులలో
"ప్రభంజాతావు" సుమా నీవు

మదిలోతుల మెదిలే మధురావేశ క్షణాన


మదిలోతుల మెదిలే మధురావేశ క్షణాన,
హ్రిదికవాటం వజ్రఖండమై మనసున కోటి విపంచికలు తానంలో మ్రోగగా
నా చిదంబర కావ్యవీచిక ఎమనేనో తెలుసా!
ప్రియా,
నీవు లేని నేను సూన్యం
నీవే నేనైనవేల మనసంతా నిశీదికారణ్యం
క్షణాన తనువు తటిల్లతా లావణ్యం
గుండె వేగం అనన్యం
చూపు అగమ్యం
ఆనందం అసామాన్యం
మనసున కారుణ్యం
క్షనానికై ఎడుచూస్తూ ........

క్షణమే చాలు



ప్రజ్వలిత చలిత కాంతి కిరణమా...
ఈ క్షణాన,నిన్ను నా చేతుల్లోకి తీసుకొనిన తరుణాన
నా శ్వాస అనే ఆస ద్వారా ఈ బాసను పరిగ్రహించు
నీతో గడిపే ఒక్క క్షణం కోసం పది సార్లు మరనిన్చడానికైన సిద్ధం.
జనన మరణాలు నా చేత లేకపోయినా
మళ్లీ జన్మించైనా నీతో గడిపిన మధుర క్షణాలను
పొందాలనివుంది ప్రియతమా